సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో బుధవారం లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించవద్దని డిమాండ్ చేస్తూ గిరిజనులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పిటిసి లక్ష్మీబాయి రవీందర్ నాయక్ మాట్లాడుతూ మాజీ ఎంపీ సోయం బాపూరావు మరియు ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు లు లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారని తెలిపారు. కావున వారిని కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.