శ్రీకాళహస్తిలో పవిత్రోత్సవాల ప్రారంభం శ్రీకాళహస్తీశ్వరాలయంలో పవిత్రోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. శ్రీ, కాళ, హస్తులైన పాము, సాలె పురుగు, ఏనుగు, భరద్వాజ మహర్షి ఉత్సవమూర్తులకు అభిషేకాలు నిర్వహించారు. ఐదు రోజులు పాటు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. తెలిసీతెలియక చేసే మంత్ర లోపం, క్రియ లోపం, భక్తి లోపం తొలగి స్వామివారికి మరింత వర్చస్సు, తేజస్సు కలిగే విధంగా దేవాలయానికి పవిత్రం చేకూరడానికి ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు.