ఈనెల 5 వ తేదీన కైకలూరులో జరిగిన ఘర్షణలో గాయపడిన దానగూడెం దళితవాడకు చెందిన యువకులను (బాధితులను) శనివారం సాయంత్రం 6 గంటలకు ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ శ్రీ రెడ్డి అప్పల నాయుడు పరామర్శించారు. దానగూడెంలోని ఐబీఎమ్ చర్చిలో బాధిత కుటుంబ సభ్యులను మరియు గ్రామస్థులను ఆయన పరామర్శించారు. యువకులతో మాట్లాడానని వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నారని వారికి ఎలాంటి ఇబ్బందీ ఉండదని తెలిపారు. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం అధిష్టానం ఆదేశాల మేరకు దానగూడెం దళితవాడకు చెందిన బాధితుల పరామర్శకు వచ్చానన్నారు.