ప్రతి వ్యాపారస్తుడు వ్యాపారానికి సంబంధించిన వృత్తి వ్యాపార లైసెన్స్ తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ సూచించారు. బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు వర్ని మండల కేంద్రంలో వృత్తి వ్యాపార లైసెన్స్ పై దుకాణదారులకు అవగాహన కల్పించారు. దుకాణ సముదాయాల వద్దకు వెళ్లి లైసెన్స్ పై అవగాహన కల్పిస్తూ పది రోజుల్లో వ్యాపారానికి సంబంధించిన లైసెన్స్ తీసుకోవాలని లేకపోతే జరిమాణాలు విధిస్తామని తెలిపారు. డి ఎల్ పి ఓ నాగరాజు, ఎంపిఓ మారుతి, పంచాయతీ కార్యదర్శి సాయిలు పాల్గొన్నారు.