గుంటూరు జిల్లా నూతన కలెక్టర్ గా శనివారం ఉదయం తమీమ్ అన్సారియా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు, సిబ్బంది నూతన జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికి, అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో నూతన జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ తనను గుంటూరు జిల్లా కలెక్టర్ గా నియమించిన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. జిల్లా అభివృద్ధికి, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం తరపు నుండి కృషి చేస్తానని చెప్పారు.