పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రజల సామాజిక బాధ్యత అని జిల్లా కలెక్టర్ డా. బి.ఆర్ అంబేద్కర్ అన్నారు. డెంకాడ మండలం పినతాడివాడలో శనివారం జరిగిన స్వర్ణాంధ-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. స్వచ్ఛాంధ్ర సాధనకు కలిసికట్టుగా కృషి చేస్తామని సభికులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. గ్రామంలో నిర్వహించిన అవగాహనా ర్యాలీలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా గ్రామ సచివాలయం వద్ద నిర్వహించిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామాల పరిశుభ్రత, స్వచ్ఛతే స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమం లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతీ 3వ శనివారం 12pm స్వర్ణాంధ్ర