ప్రజలకు ఎలాంటి విఘ్నాలు కలగకుండా సల్లగా గణనాధుడు చూడాలని డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లి బాబు యాదవ్ కోరారు.కామేపల్లి మండలం కొమ్మినేపల్లిలో కొత్త కాలనీసెంటర్ లో అత్యంత భక్తిశ్రద్ధలతో,భారీ సెట్టింగ్ లతో గణనాథుడు కొలువయ్యాడు. నవరాత్రి పూజలు, ఉత్సవాలు జరుపుకొని తన మాతృమూర్తి గంగమ్మ ఒడిలో నిమజ్జనం జరుపుకోవడానికి శోభాయాత్ర జరిగింది.ఈ కార్యక్రమాన్ని డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ ప్రారంభించారు. శాంతియుత వాతావరణంలో భక్తి శ్రద్ధలతో గణపతి నవరాత్రి ఉత్సవములు జరిపిన కమిటీ సభ్యులను మల్లి బాబు యాదవ్ అభినందించారు.