సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని షేకాపూర్ లో గల హజ్రత్ షేక్ షాబుద్దీన్ తుర్కీ రహమతుల్లా దర్గా 673 వ ఉర్సు ఉత్సవాలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి. సోమవారం సాయంత్రం ఉత్సవాలు ప్రారంభమై మంగళవారం ముగియనున్నాయి. ఉత్సవాల్లో గంధం ఊరేగింపులు, అంతర్జాతీయ ఖవ్వాలి ప్రదర్శనలు నిర్వహించనున్నారు. భక్తులు వివిధ ప్రాంతాల నుండి తరలి రానున్న నేపథ్యంలో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసినట్లు కమిటీ సదర్ శశిముద్దీన్ తెలిపారు.