కాగజ్ నగర్ రైల్వే స్టేషన్ ను బుధవారం దక్షిణ మధ్య రైల్వే డిఆర్ఎం గోపాలకృష్ణన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. త్వరలో కాగజ్నగర్ నుండి వందే భారత రైలుతో పాటు మరో నాలుగు ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభం కానున నేపథ్యంలో స్టేషన్ లోని ప్లాట్ఫారాలు ప్రయాణికుల సౌకర్యాలు పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలను పర్యవేక్షించినట్లు తెలిపారు. అధికారులతో సమావేశం నిర్వహించి స్టేషన్లో అవసరమైన సౌకర్యాలను మరింత మెరుగుపరచాలని సంబంధిత రైల్వే అధికారులకు సూచించారు,