ఈవీఎంలతో గెలిచిన కూటమి ప్రభుత్వం ప్రజలకు అనేక ఇబ్బందులు పెడుతోందని పెనుకొండలో మాజీ మంత్రి శంకర్ నారాయణ విమర్శించారు. అనంతపురం జిల్లా సస్యశ్యామలంగా, ఆర్టికల్చర్ హబ్ గా మారటానికి కారణం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కారణమని గుర్తు చేశారు. ఆయన ఆశయాల సాధన కోసం జగన్ నాయకత్వంలో ముందుకు సాగుతామని, వచ్చే ఎన్నికల్లో జగన్ను సీఎంగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.