అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం మంచిర్యాల పట్టణంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యానికి ముందే కుల వివక్ష, అంటరానితనం, మూఢనమ్మకాల నిర్మూలనకు పూలే పోరాడారని తెలిపారు. సమాజం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిబా పూలే అని పేర్కొన్నారు.