విశాఖలోని సంపత్ వినాయక ఆలయంలో బుధవారం వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఆలయా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. బుధవారం రాత్రి కూచిపూడి భరతనాట్యం సంప్రదాయాన్ని నృత్యాలతో చిన్నారులు ఆకట్టుకున్నారు. సాంస్కృతిక ప్రదర్శనలతో దేవాలయంలో సందడి వాతావరణం సంతరించుకుంది.