శ్రీకాకుళంలో కులవృత్తిని నమ్ముకుని వినాయక విగ్రహాలు తయారు చేస్తున్న కుమ్మరి కుటుంబాలు మట్టి రంగులు ఇతర సామగ్రి ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో పాటు తమ శ్రమకు తగిన గిట్టుబాటు ధర లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పర్యావరణ హితమైన మట్టి విగ్రహాలకు గిరాకీ పెరుగుతున్నప్పటికీ పెరుగుతున్న ఖర్చులతో వారి బతుకులు మారడం లేదని శనివారం సాయంత్రం మీడియాతో వాపోయారు..