సివిల్, ఎపిఎస్పీ కానిస్టేబుళ్లుగా ఎంపికైన అభ్యర్థులు ఆగస్టు 25, 26 తేదీలలో ఒరిజినల్ సర్టిఫికెట్లతో తప్పనిసరిగా హాజరుకావాలని కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు తెలిపారు. జిల్లా ఎపిఎస్పీ 2వ బెటాలియన్ పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన SCT కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియలో ఎంపికైన సివిల్, ఎపిఎస్పీ విభాగాలకు చెందిన పురుష, మహిళా అభ్యర్థులు ఆగస్టు 25, 26 తేదీలలో ఉదయం 10 గంటలకు కర్నూలు పోలీసు కార్యాలయం (కొండారెడ్డి బురుజు దగ్గర) వద్ద హాజరుకావాలని ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు.అభ్యర్థులు తమ అప్లికేషన్ సమయంలో సమర్పించిన అన్ని అసలు ధృవపత్రాలు, Annexure – I (Revised Attestation Form) ను గెజిటెడ్ అధికారితో అటెస్టేషన్ చేయించుకున్న 3 సెట్ల జిరాక్స్ కాపీలు, అలాగే 4 పాస్‌పోర్ట్ సైజ్ కలర్ ఫోటోలు తీసుకురావాలని ఎస్పీ సూచించారు. ఈ మేరకు ఎంపికైన వారందరూ నిర్దిష్టమైన తేదీల్లో తప్పక హాజరు కావాలని ఆయన కోరారు.