తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. జేసీ ప్రభాకర్ రెడ్డి, టీడీపీ నేత కాకర్ల రంగనాథ్ అనుచరులు పరస్పరం రాళ్లు, కట్టెలతో దాడులకు దిగారు. పట్టణంలోని అశోక్ పల్లర్ సమీపంలో మోర్ మార్కెట్ వద్ద ఇరు వర్గాల మధ్య ఆర్కెస్ట్రా, వినాయక విగ్రహాల విషయంలో గొడవ జరిగింది. తమ విగ్రహం ముందు వెళ్లాలంటే.. తమ విగ్రహం ముందు వెళ్లాలంటూ పరస్పరం రాళ్లు, కట్టెలతో కొట్టుకున్నారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు రంగంలోకి దిగారు.