గద్వాల జిల్లాలో 3 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కురిసిన వర్షపాతం 26.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఎక్కువగా ఉండవెల్లిలో 56.4 మిల్లీమీటర్లు, కేటిదొడ్డిలో తక్కువగా 11.0 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ధరూర్ 17.0, గద్వాల 24.0, ఇటిక్యాల 25.0, మల్దకల్ 17.6,గట్టు 24.8, వడ్డేపల్లి 15.3, మానవపాడు 47.0, అలంపూర్ 36.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిందని అధికారులు తెలిపారు..