కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పద్మశాలి టౌన్షిప్లో గల స్క్రాప్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మంటలను ఆర్పి వేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.