ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుండి అందిన అర్జీలను క్షుణంగా పరిశీలించి నాణ్యతతో సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, జిల్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ,జిల్లా అధికారులు, పిజిఆర్ఎస్ ఆడిట్ టీమ్ అధికారులతో సమావేశమై శాఖల వారీగా పిజిఆర్ఎస్ పై పూర్తిస్థాయిలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి పిజిఆర్ఎస్ లో అందిన అర్జీల పరిష్కారంపై అత్యంత ప్రాధాన్యత ఇస్తూ పి జి ఆర్ ఎస్ అర్జీల పరిష్కరించాలన్నారు