విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సమీపంలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం కావడంతో కలకలం రేగింది. బుధవారం సాయంత్రం సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతి చెందిన వ్యక్తి వయసు సుమారు 50-55 సంవత్సరాల మధ్య ఉంటుందని మాచవరం హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ తెలిపారు. ఈ వ్యక్తి ఆచూకీ తెలిసిన వారు మాచవరం పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలని ఆయన కోరారు.