పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో ఆదివారం సాయంత్రం వినుకొండ మార్కెట్ యార్డ్ చైర్మన్ మీసాల మురళి యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన వద్దే పనిచేసిన ఇద్దరు వ్యక్తులు, వారి కుటుంబాల మధ్య ఘర్షణకు రాజకీయ రంగు పులిమి తెలుగుదేశం నిందలు వేయడం బొల్ల బ్రహ్మనాయుడు దిగజారుడుతనానికి నిదర్శమని ధ్వజం మెత్తారు. అన్నవరం గ్రామంలో కత్తిపోట్లపై వైకాపా, బొల్లా రాజకీయంగా చేస్తున్న విమర్శలను ఘాటుగా ఖండించారు. ఆయన ఊరు పోలేరమ్మ జాతర సందర్భంగా ప్రసాద్ గోపీల మధ్య వివాదాన్ని జరిగితే అది తెలుగుదేశం పార్టీకి ఎలా సంబంధమని ప్రశ్నించారు.