రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ అంటూనే అన్నదాతలైన రైతుల్ని అన్నిరకాలుగా అష్టకష్టాలపాలు చేస్తోందని మాజీ ఎంపీ పిఠాపురం వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ వంగా గీతావిశ్వనాథ్ పేర్కొన్నారు.కాకినాడ జిల్లా పిఠాపురం వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు పార్టీ నాయకులతో కలిసి వంగా గీతావిశ్వనాథ్ మీడియా సమావేశం నిర్వహించారువ్యవసాయ ఎరువుల బ్లాక్ మార్కెట్ పై ఈ నెల 9న ఆర్డీఓ కార్యాలయాల వద్ద వైఎస్సార్సీపీ తలపెట్టిన "అన్నదాత పోరు" కార్యక్రమానికి సంబందించిన పోస్టర్లను ఆమె ఆవిష్కరించారు.ఈ సందర్బంగా వంగా గీతావిశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు