శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో స్త్రీ శక్తి పథకం అమలుతో ఆటో డ్రైవర్ల పరిస్థితి దారుణంగా మారిందని ఆటో యూనియన్ అధ్యక్షుడు రామాంజనేయులు తెలిపారు. శనివారం మధ్యాహ్నం ఆటో డ్రైవర్లతో సమావేశమై ఆయన మాట్లాడుతూ.. ఫ్రీ బస్సుల కారణంగా ఆదాయం తగ్గి, EMIలు చెల్లించలేక దాదాపు 120 ఆటోలు ఫైనాన్స్ సంస్థలు స్వాధీనం చేసుకున్నాయని అన్నారు. ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని, సీఎం వెంటనే స్పందించి న్యాయం చేయాలని కోరారు.