తెలంగాణ వరప్రదాయని కాలేశ్వరం పైన కేసీఆర్ పైన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు నిరసనగా మాజీ మంత్రి కేటీఆర్ పిలుపుమేరకు కార్పొరేటర్ సామల హేమ బీఆర్ఎస్ నాయకులతో కలిసి మంగళవారం మధ్యాహ్నం నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కాళేశ్వరం పైన కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను తిప్పికొడతామని తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం మరో పోరాటానికైనా సిద్ధమని తెలిపారు.