ఆస్పరి సొసైటీ సీఈవోగా నరసింహులు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మండల యువనాయకులు సతీష్కుమార్, మేకల రంగనాథ్ ఆధ్వర్యంలో శాలువా కప్పి ఆయనను సన్మానించారు. రైతులకు సకాలంలో లోన్లు అందించి, ఎలాంటి అవినీతి లేకుండా పారదర్శకంగా వ్యవహరిస్తామని నరసింహులు తెలిపారు. కార్యక్రమంలో మారేశ్, మహేష్, సొసైటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.