నిర్మల్ పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లో CEIR పోర్టల్ సాయంతో నెల రోజుల్లో రూ.7.80 లక్షల విలువైన 65 మొబైల్ ఫోన్లు రికవరీ అయ్యాయి.ఇప్పటివరకు జిల్లాలో మొత్తం రూ.1.95 కోట్ల విలువైన 1631 ఫోన్లు తిరిగి సాధించినట్లు ఎస్పీ జి. జానకి షర్మిల మంగళవారం తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో బాధితులకు వారు చోరీకి గురైన ఫోన్లు అందజేశారు