ఇటీవల కురిసిన భారీ వర్షానికి వరద నీరు వచ్చి 3 ఎకరాల పత్తి పంట నష్టం జరిగిందని బాధిత రైతు తిరుపతి గురువారం ఆరోపించాడు. వాంకిడి మండలం జైథ్పూర్ గ్రామపంచాయతీ పరిధిలో రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి కొమురం భీం ప్రాజెక్టు 7 గేట్లు వేశారు. దీంతో భారీగా వరద నీరు వచ్చి పత్తి పంటను నాశనం చేసిందన్నారు. 3 ఎకరాల పత్తి పంట మొత్తం ఎండిపోయిందన్నారు. ప్రభుత్వం స్పందించి నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.