ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి వ్యవసాయ సహకార సంఘం కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు గురువారం ఉదయం నుంచి బారులుదీరారు. కొండాయి, గోగుపల్లి, శివాపురం, వెంకటాపురంతో పాటు మరికొన్ని గ్రామాలకు చెందిన రైతులు ఆధార్ కార్డు, పట్టా బుక్కులు పట్టుకొని ఉదయాన్నే కేంద్రం వద్దకు చేరుకున్నారు. కాగా, ఒక ఆధార్ కార్డు కలిగిన రైతుకు 2 యూరియా బస్తాలు ఇస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.