అల్లూరి జిల్లా పెదబయలు మండలం గిన్నెలకోట పంచాయతీ ఇనుప తీగల గ్రామం పై బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో కొండ చరియలు ఒక్క సారిగా విరిగిపడ్డాయి. దీని కారణంగా గ్రామానికి చెందిన ఆస్తి నష్టమైనట్లుగా స్థానిక గిరిజనులు బుధవారం ఉదయం 11 గంటల సమయంలో పాడేరు మీడియాకి ఆ వివరాలను చేరవేశారు. గ్రామ సమీపంలో ఉన్న కొండపై నుండి ఒక్కసారిగా మట్టి పెల్లలు విరిగిపడడంతో గ్రామస్తులు భయంతో పరుగులు తీస్తామని సమీపంలో ఉన్న చర్చి సగం వరకు మట్టితో నిండిపోయింది అని తెలియజేశారు. తాము పండిస్తున్న పసుపు పంట సైతం కొట్టుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.