నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ప్రతిష్టించిన వినాయకుని నిమజ్జన వేడుకలు మంగళవారం సాయంత్రం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, వినాయకుడి ఆశీస్సులతో ప్రజల జీవితాల్లో శాంతి, ఐశ్వర్యం నెలకొని, సమాజం అభివృద్ధి చెందాలని అన్నారు. విగ్రహదాత, లడ్డూ వేలంలో గెలుచుకున్న వారికి కలెక్టర్ సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. పూజా కార్యక్రమం అనంతరం ఉద్యోగులు, సిబ్బంది వినాయకుని శోభాయాత్రను నిర్వహించారు. భక్తిగీతాలకు నృత్యాలు చేస్తూ ఊరేగింపుగా తీసుకెళ్లి, వినాయక్ సాగర్ (బంగల్ పేట్) చెరువులో గణనాథుని నిమజ్జన