రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి పిలుపునిచ్చారు. శనివారం కలకడ మండల కేంద్రంలో నిర్వహించిన “స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల మూడవ శనివారం విస్తృతంగా పరిశుభ్రత కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజలందరూ పరిశుభ్రత పట్ల మరింత చైతన్యం కలిగి స్వచ్ఛ ఆంధ్ర లక్ష్య సాధనలో భాగస్వాములవ్వాలని కోరారు.