సోమవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఐ డి ఓ సి కార్యాలయంలోని ప్రజావాణి మందిరంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఫిర్యాదారులతో నేరుగా సమస్యలను స్వీకరించి వారి సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుండి మంత్రుల నుండి వచ్చిన ఫిర్యాదులపై వేగవంతంగా పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని ఆదేశాలు ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా 44 ఫిర్యాదులు వచ్చినట్లు సూచించారు.