శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని మంత్రి సవిత నివాసం వద్ద దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా బుధవారం మధ్యాహ్నం మంత్రి సవిత ఆయుధ పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి సవిత వాహనాలు, కార్లకు పూజలు చేశారు. అదేవిధంగా మంత్రి సవిత ఎస్కార్ట్కు సంబందించిన పోలీసుల తుపాకులకు, భద్రత సిబ్బంది ఘన్లకు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.