కోడూరు లో పొలం గట్ల వివాదంలో తనకు న్యాయం జరగలేదని కోడూరు గ్రామానికి చెందిన రైతు చిట్టిపోలు నరసింహ ఆదివారం పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితుని వివరాల మేరకు తన సరిహద్దు పొలంలోని రైతు తన గట్టును ఎక్కువగా నరికి వేయడంతో నరసింహ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈరోజు కూడా సరిహద్దు గట్టు విషయమై గొడవ జరగడంతో పోలీసులు తనకు న్యాయం చేయలేదని ఆరోపిస్తూ ఈ చర్యకు పాల్పడినట్లు తెలిపారు.