ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పరిపాలించి ఎన్నో మంచి సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత వైయస్సార్ కి దక్కుతుందని ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు అన్నారు. రైతులకు ఉచిత విద్యుత్, ఆరోగ్య శ్రీ, విద్యార్థులకు పీజురీయింబర్స్ మెంట్, 108 అంబులెన్స్ సేవలు, జలయజ్ఞం, ప్రతి పేదవాడికి ఇల్లు, ఇలా ఎన్నో మంచి అభివృధి కార్యక్రమాలు చేపట్టి బడుగు బలహీన వర్గాల హృదయల్లో చెరగరాని ముద్ర వేసుకొని సుస్థిరస్థానాన్ని సంపాదించుకొని ఈరోజు ప్రతి పేదవాడు గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఏకైక నాయకుడు వైయస్సార్ అని గుర్తు చేశారు,