ఏలూరు జిల్లా పెదవేగి మండలం కొప్పాక గ్రామంలోని ఆర్సీఎం చర్చి వేలాంగిణిమాత 21వవార్షికోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. వేడుకలలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు. ఈమేరకు కేక్ చేసి, ఫాదర్,విశ్వాసులు, గురువులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఏటా క్రమం తప్పకుండా కొప్పాక గ్రామంలో ఘనంగా వేలాంగిణీమాత వార్షికోత్సవాలు నిర్వహిస్తున్న ఆర్సీఎం చర్చి నిర్వహకులను ఎమ్మెల్యే అభినందించారు.