స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని, ట్రూ ఆఫ్ చార్జీలను ఉపసంహరించాలంటూ ప్రజా వేదిక ఆధ్వర్యంలో మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంటకు భీమవరంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు జేఎన్‌వీ గోపాలన్, ఏఐటీయూసీ నేత చల్లబోయిన రంగారావు మాట్లాడుతూ ప్రజలపై భారాలు మోపే విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలని, కేంద్ర విద్యుత్ సంస్కరణలను అమలు చేయడాన్ని నిరసించామని తెలిపారు. గతంలో వాడిన విద్యుత్తుకు ఇప్పుడు అదనపు రుసుములు వేయడాన్ని తప్పుబట్టారు.