విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేరుతో 44 విభాగాలను ప్రైవేటు వారికి అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించండి వ్యతిరేకిస్తూ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం విజయవాడలోని ఎంబి భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి గౌతమ్ రెడ్డి, సిఐటియు నాయకులు సిహెచ్ నర్సింగ్ రావు, సిపిఐ నాయకులు రామకృష్ణ, సిపిఎం నాయకులు వి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.