రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడం అత్యంత దారుణమని వైఎస్ఆర్సిపి పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త *తమ్మినేని సీతారాం* అన్నారు. పిపిపి విధానం ద్వారా పది మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేసి తనకు సంబంధించిన వ్యక్తులకు కట్టబెట్టి తద్వారా వేలకోట్లు దోచుకుని అవినీతికి పాల్పడేందుకు చంద్రబాబు తెరలీసారని సీతారాం ఆరోపించారు. 2019-24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వున్న కాలంలో 15 మెడికల్ కాలేజీలు ఏర్పాటు లో భాగంగా ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభించడం జరిగిందని మిగతా మెడికల్ కాలేజీలు పనులు పూర్తి అయ్యాయని వీటిని చంద్రబాబు ప్రైవేట్ పరం చేయడం దారుణమన్నారు