బాలానగర్ మండలం చెన్నంగులగడ్డ తండాలో హనుమాన్ ఆలయ పున ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. ఈ సందర్భంగా గిరిజనులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవుడు దయతో ప్రతి ఒక్కరు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు.