కూకట్పల్లిలోని విజయనగర్ కాలనీకి చెందిన ఒక వ్యక్తి ద్వారా వివేకానంద నగర్ లోని ఏరువాక టిఫిన్స్ నుంచి ఇడ్లీ సాంబార్ ఆర్డర్ చేశాడు. డెలివరీ బాయ్ ఇచ్చిన ఆర్డర్ అను తింటుండగా, సాంబార్ లో బొద్దింక కనిపించడంతో ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. శుభ్రత పాటించకుండా ఆన్లైన్ ద్వారా ఇష్టం వచ్చినట్లు ఆహారాన్ని సరఫరా చేస్తున్నారని, హోటల్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ వ్యక్తి డిమాండ్ చేశారు.