శనివారం రోజున డివిజన్ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన వినాయక మండపాల వద్ద విద్యుత్ తీగలు ఏర్పాటులో నాణ్యత తీగలు వాడాలని తీగల్లో లోపాలు ఉంటే మండపం వద్ద షార్ట్ సర్క్యూట్తో భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని, దేవుని వద్ద వెలిగించే దీపాలపై పర్యవేక్షణ ఉండాలని అజాగ్రత్తగా ఉంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని తొమ్మిది రోజులపాటు నవరాత్రులు ఆనందంగా జరుపుకునేందుకు జాగ్రత్తలు పాటించి భక్తి భావంతో ముందుకెళ్లాలంటూ వినాయక మండపం దారులకు సూచించారు పెద్దపెల్లి ఏసిపి జి కృష్ణ యాదవ్