కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా బుధవారం తెల్లవారు జామున నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది. భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి.కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంట, రుక్మిణికుంట, గాంధీనగర్, అయ్యప్ప నగర్ తదితర లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తా, జన్మభూమి రోడ్, విద్యానగర్ కాలనీలోకి వర్షపు నీరు ఇండ్లలోకి వచ్చి చేరింది. భారీ వర్షానికి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.