నాగోలు డివిజన్ పరిధిలోని ఆప్కో కాలనీలో ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి అధికారులతో కలిసి శనివారం మధ్యాహ్నం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన స్థానికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాలనీలో ఇలలోకి పాములు క్రిమి కీటకాలు వస్తున్నందున కాలనీ దగ్గర గోడ కట్టినట్లు వివరించారు ఆ గోడ కారణంగా చుట్టుపక్కల కాలనీవాసులు సరైన రహదారి లేక ఇబ్బందులు పడుతున్నామని ఎమ్మెల్యేకు తెలిపారు. రహదారిని తొలగించాలని కాలనీవాసులు కోరారు. స్పందించిన ఎమ్మెల్యే త్వరలో ట్రంక్ లైన్ పనులు ప్రారంభం కానున్నాయని దారికి అడ్డుగా ఉన్న గోడను కూడా తొలగిస్తామని తెలిపారు. ఎటువంటి సమస్యలు ఉన్నా తెలియజేయాలన్నారు.