Download Now Banner

This browser does not support the video element.

గుంతకల్లు: గుత్తిలోని ప్రభుత్వ పెన్షనర్ల భవనంలో ఘనంగా సంఘ సంస్కర్త గిడుగు రామ్మూర్తి 162 వ జయంతి వేడుకలు

Guntakal, Anantapur | Aug 29, 2025
గుత్తిలోని ప్రభుత్వ పెన్షనర్ల భవనంలో శుక్రవారం ప్రముఖ సంఘ సంస్కర్త గిడుగు రామ్మూర్తి 162 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పెన్షనర్ల అసోసియేషన్ అధ్యక్షులు అబూబకర్, కోశాధికారి కుల్లాయి బాబు ఆధ్వర్యంలో జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అందరూ గిడుగు రామ్మూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని అసోసియేషన్ అధ్యక్షులు అబూబకర్ కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు స్వర్ణాంబ, ఫక్రుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us