మనసురాబాద్ డివిజన్లోని జడ్జెస్ కాలనీలో నూతనంగా నిర్మించిన ఓపెన్ జిమ్, పార్కును ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి ఆదివారం మధ్యాహ్నం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాభివృద్ధికి ఇలాంటి సదుపాయాలు ఎంతో దోహదం చేస్తాయని పేర్కొన్నారు. కాలనీవాసులు పార్కు ఓపెన్ జీమ్ ను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.