నన్ను కాపాడండి సార్ చంద్రబాబు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే దగ్గుపాటి గారు అంటూ అనంతపురం నగరంలోని ఆజాద్ నగర్ కు చెందిన నిజాం అనే వ్యక్తి సౌదీలో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్న సెల్ఫీ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ సందర్భంగా అతను వేడుకున్న వీడియో సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతోంది. తనను ఇండియాకు రప్పించాలని కోరుకుంటున్నాడు.