పోలీస్ కామాండ్ కంట్రోల్ రూమ్ లోని CC కెమెరాల ద్వారా ట్రాఫిక్ నియమాలను ఉల్లంగించిన వారికీ తప్పకుండ ఈ చలాన్ జరిమానాలు విధించాలని జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు, ఐపీఎస్ పోలీస్ సిబ్బందిని ఆదేశించారు.గురువారం మధ్యాహ్నo గద్వాల జిల్లా ఎస్పీ కార్యాలయం లోని పోలీస్ కామాండ్ కంట్రోల్ రూమ్ లోని CC కెమెరాల పని తీరును పరిశీలించారు. అందులో గద్వాల పట్టణం CC కెమెరాలు కామాండ్ కంట్రోల్ రూమ్ లో విసిబుల్ అవుతున్న వివరాలు, ట్రాఫిక్ నియమాలు ఉల్లంగించిన వారికీ విదిస్తున్న జరిమానాలు, తదితర వివరాలను సిబ్బంది ఎస్పీకి వివరించారు.