కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి గ్రామంలో గురువారం వినాయకుని నిమజ్జన శోభాయాత్ర అంగరంగ వైభవంగా కొనసాగింది. గ్రామంలోని పురవీధుల గుండా గణనాధులను ఊరేగించారు డబ్బు చప్పులతో నృత్యాలతో వైభవంగా నిమర్జనం శోభాయాత్ర కొనసాగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అనంతరం గణనాధులను టేక్రియాల్ చెరువులో నిమజ్జనం చేశారు.