తల్లి కొడుకుల పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన ఘటన వికారాబాద్ జిల్లా పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటుచేసుకుంది. మంగళవారం స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని రాపోల్ గ్రామంలో తల్లి కొడుకు పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేయడంతో తల్లి నరసమ్మ మృతిచెందగా కొడుకుకు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. స్థానికులసమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నరసమ్మ మృతదేహాన్ని మార్చరీకి తరలించారు ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.