కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో గణపతి నవరాత్రుల మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో చివరి ఘట్టమైన నిమజ్జన కార్యక్రమం శనివారం మధ్యాహ్నం నుంచి ఉత్సాహంగా కొనసాగుతోంది. డప్పు వాయిద్యాలు, కోలాట భజనలు, డీజే సౌండ్స్, బాణసంచా కాల్పుల మధ్య గంగమ్మ చెంతకు గణపయ్య విగ్రహాలను తీసుకువెళ్తున్నారు. రేపు గ్రహణం ఉన్నందున పిఠాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లి మండలాల్లో ఈ రోజే గణపతి విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు.